NHRC: మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి...! 12 d ago
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. NHRC 9వ చైర్‌పర్సన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం గత జూన్‌లోనే ముగిసింది. అప్పటి నుంచి చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా రామసుబ్రమణియన్ ను నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆదేశాలు జారీ చేశారు.